Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లింబాద్రికి కులనిర్మూలన వేదిక వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంజినీరింగ్, మెడికల్, ఫార్మసీ వంటి విద్యాసంస్థల్లో ర్యాగింగ్ పేరుతో కులవివక్షత చేస్తున్న విధానాన్ని నియంత్రించాలని కుల నిర్మూలన వేదిక డిమాండ్ చేసింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రిని మంగళవారం వేదిక రాష్ట్ర అధ్యక్షులు పాపని నాగరాజు నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. రోజురోజుకు రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ ఇతర సామాజిక వర్గాలపై కుల ఆధారిత, కుల వివక్షత వేధింపులు నూతన పద్ధతుల్లో జరుగుతున్నాయని తెలిపారు. విశ్వవిద్యాలయాలు, ప్రయివేటు, వృత్తి విద్యా కాలేజీల్లో ఈ వేధింపులు, అంటరానితనం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. ర్యాగింగ్ సాధారణమని చెప్పే కాలేజీల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ పేద విద్యార్థులు ఉన్నత, సాంకేతిక విద్యను అభ్యసించే అవకాశం కల్పించాలని కోరారు.