Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు బక్కని నర్సింహులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలుగుజాతి స్ఫూర్తి ప్రదాత ఎన్టీఆర్ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు బక్కని నర్సింహులు కొనియాడారు. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 26వ వర్థంతిని పురస్కరించుకుని మంగళవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్లో టీడీపీ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలేసి నివాళులు అర్పించారు. రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...పెత్తందారులు, ధనికులకే పరిమితమైన రాజకీయాలను బలహీనవర్గాలకు, మహిళలకు చేరువ చేసిన ఘనత ఎన్టీఆరేదనని ప్రశంసించారు. 1983 అసెంబ్లీ ఎన్నికల్లో 125 మంది గ్రాడ్యుయేట్లు, 20 మంది డాక్టర్లు, 8 మంది ఇంజినీర్లు, 47 మంది లాయర్లకు టికెట్లు ఇచ్చి ప్రోత్సహించిన విషయాన్ని గుర్తుచేశారు. టీడీపీని చంద్రబాబునాయుడు ముందుకు తీసుకెళ్తున్నారనీ, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టుల ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. తెలంగాణలో 540 మంది పేదలకు ఎన్టీఆర్ స్కూల్లో విద్యాబోధన చేయిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కె.రవీంద్రకుమార్, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షులు చిలువేరు కాశీనాథ్, అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి, రాష్ట్ర ప్రధానకార్యదర్శులు ఎ.రాజునాయక్, షేక్ అరీఫ్, రాష్ట్ర నాయకులు ప్రకాశ్‌రెడ్డి, జి.ఇందిరా, ఎం.వెంకటరాజంగౌడ్, పి.రవీందర్, పి.అశోక్, మోహన్, ఏపీ సూపర్‌స్పెషాలిటీ డెంటల్ ఆస్పత్రి చైర్మెన్ డాక్టర్ కడియాల రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.