Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్కు టీఎస్ఆర్టీసీ జేఏసీ విజ్ఞప్తి
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను తక్షణం తీర్చాలని టీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జేఏసీ చైర్మెన్ కె రాజిరెడ్డి మంగళవారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీ కార్మికులకు 2017 ఏప్రిల్ 1, 2021 ఏప్రిల్ 1 నుంచి రెండు ఫిట్మెంట్లు రావల్సి ఉందని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు 30శాతం ఫిట్ మెంట్ తో వేతన సవరణ చేసి, ఆర్టీసీ కార్మికులకు చేయకపోవడం సరికాదన్నారు. 2019 జనవరి నుంచి 5 నెలల ఎరియర్స్ కూడ రావాలని తెలిపారు. కార్మికులకు ఆరు డిఏలు కూడా ఇవ్వాల్సి ఉందన్నారు. తక్షణం ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.