Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు డీఏల మంజూరుపై హర్షం: తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బకాయి ఉన్న ఐదు డీఏలకుగాను ఎట్టకేలకు మూడు డీఏలకు క్యాబినెట్ ఆమోదం తెలపడం పట్ల తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ హర్షం ప్రకటించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అసోసియేషన్ అధ్యక్షులు చిలగాని సంపత్‌కుమారస్వామి మంగళవారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. పీఆర్సీ బకాయిలు ఇదే ఆర్థిక సంవత్సరంలో విడుదల చేయాలని కోరారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల స్థానికతను కొల్లగొడుతున్న 317 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. వీఆర్వోలకు డ్యూటీచార్ట్ రూపొందించాలనీ, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలనీ, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సూచించారు. ఈ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించాలని కోరారు. తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్లుగా వేముల రాధికరెడ్డి, దోనేపూడి చక్రపాణి, శ్రీనివాస్‌కర్ణ, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా ఆఫ్తాబ్ అహ్మద్‌ఖాన్‌ను నియమించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి పురుషోత్తం, మహిళా విభాగం అధ్యక్షురాలు జి నిర్మల, కోశాధికారి గడ్డం బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.