Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.17 వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత
నవతెలంగాణ - కరీంనగర్ టౌన్
కరీంనగర్ నగర పాలక సంస్థ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటున్న మున్సిపల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామన్‌ను పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ కె.భద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం.. కాంట్రాక్టర్ మధుకర్ చేసిన పలు పనులకు సంబంధించిన బిల్లుల ఫైల్‌ను ముందుకు పంపే విషయంలో ఈఈ రామన్ జాప్యం చేశారు. దీంతో సదరు కాంట్రాక్టర్ ఆయనను సంప్రదించగా బిల్లుకు సంబంధించిన మొత్తంలో ఒక శాతం ఇవ్వాలని ఈఈ డిమాండ్ చేయగా.. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. కార్పొరేషన్ కార్యాలయంలో కాంట్రాక్టర్ నుంచి ఈఈ రామన్ రూ.15వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అదనపు సమాచారం మేరకు రామన్‌కు సంబంధించిన హైదరాబాద్, జగిత్యాల, కరీంనగర్ ఇండ్లల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నామని పూర్తి విచారణ చేపట్టిన అనంతరం మరిన్ని వివరాలు తెలియజేస్తామని ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపారు.