Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూకబ్జాదారుల ప్రయోజనాల కోసమే విగ్రహావిష్కరణ
- రియల్ఎస్టేట్ కోసమే కార్యక్రమమా?
- రాష్ట్రపతి, మోడీ రాకను అడ్డంపెట్టుకుని సర్కారు వ్యాపారం
నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్
మనుషు లంతా సమానమేనంటూ బోధిస్తు న్న చిన్నజీయర్ స్వామి వద్ద వాస్తవానికి ఆ స్ఫూర్తి కనిపించడం లేదని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఆయన చుట్టూ రియల్ఎస్టేట్ బ్రోకర్లు దర్శనమిస్తున్నారని చెప్పా రు. భూకబ్జా దారుల ప్రయోజనాల కోసమే ఆయన రామాను జాచార్యుల విగ్రహా విష్కరణ చేయబోతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమానికి వస్తున్న రాష్ట్రపతి, ప్రధానిమోడీ రాకను అడ్డంపెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారంచేస్తున్నదని విమర్శించారు. వైష్ణవులు, శైవులు అనే వ్యత్యాసాన్ని ప్రదర్శిస్తూ...కొంత మందిని అవమానిస్తున్నారని ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్‌లోని కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) కార్యాయంలో రేవంత్ విలేకర్లతో ఇష్ట్టాగోష్టిలో మాట్లాడారు. చిన్నజీయర్ స్వామిపై తమకు అపారమైన గౌరవం ఉందనీ, అయితే రియల్ఎస్టేట్ బ్రోకర్లను పక్కన పెట్టుకుని తిరిగితే తమకు అనుమానాలు కలుగుతున్నా యని చెప్పారు. రియల్ కంపెనీ కోసం ఆశ్రమాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. అంత గొప్ప కార్యక్రమం చేస్తున్నది ఒక రియలేస్టేట్ సంస్థ కోసమా? అని ప్రశ్నించారు. సదరు సంస్థ ఆస్తులను పెంచేందుకు ప్రభుత్వం కూడా సహకరించడం విచారకరమన్నారు. మొక్కల పెంపకం గురించి చెబుతున్న ప్రభుత్వం...ఆ సంస్థ కోసం చెట్లను నరకడమేంటని ప్రశ్నించారు. దీనిపై బీజేపీ కూడా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జీయర్ స్వామిని కలిసి ఏమైనా చెప్పాలంటే, ఆయన చుట్టు రియల్ వ్యాపారులే ఉంటారని ఆవేదన వ్యక్తం చేశారు.
బీజేపీది వాపే...
రాష్ట్రంలో బీజేపీ బలుపు కాదనీ, వాపేనని రేవంత్ చెప్పారు. ఆపరేషన్ ఆకర్ష్ కోసం బీజేపీ కమిటీ వేయడంతో ఆ పార్టీ బలమేంటో తేలిపోయిందన్నారు. ఇప్పటికే ఆ పార్టీ దివాళా తీసిందనీ, ఇతర పార్టీల నుంచి తీసుకున్న నేతలతో కమిటీ వేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. సీఎం కేసీఆర్ పాఠశాలలను మూసివేసి, పేదలను విద్యకు దూరం చేస్తున్నారని విమర్శించారు. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేస్తే పేదలకు 25 శాతం ఉచిత విద్య అందే అవకాశం ఉందన్నారు. ఉపాధ్యాయుల కొరత ఉన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం పాఠశాలు ఎలా సాధ్యమని ప్రశ్నించారు. డీఎస్సీ నోటిఫికేషన్ ఎందుకు వేయడం లేదని సీఎంను ప్రశ్నించారు. పాఠశాలల్లో కరోనా మరణాల సంఖ్య ఒక్కటి కూడా లేదనీ, అయినా పాఠశాలలను మూసివేశారని చెప్పారు. బార్లు, పబ్‌లతో మరణాలు సంభవిస్తున్నాయనీ, వాటి నుంచి ఆదాయం వస్తుంది కాబట్టి వాటిని మూసివేయడం లేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత యూనివర్సిటీలు సైతం నిర్వీర్యమవుతున్నాయని చెప్పారు. టీఆర్ఎస్ యూపీలో ఎస్పీకి మద్దతుగా ప్రచారం చేస్తే ఎంఐఎంకి మిత్రద్రోహం చేసినట్లేనన్నారు. యూపీలో ఎంఐఎం 100కు పైగా స్థానాల్లో పోటీ చేస్తున్నదని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంఐఎంతో మిత్రపక్షంగా ఉంటూ యూపీలో ఎస్పీకి ఎలా ప్రచారం చేస్తారని టీఆర్ఎస్ నేతలను రేవంత్ ప్రశ్నించారు.