Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక సంఘాల పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా బుధవారం కార్మిక, కర్షక ఐక్యతాదినాన్ని పాటించాలని తెలంగాణ రైతు సంఘం, సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీలు పిలుపునిచ్చాయి. జిల్లా, మండలకేంద్రాల్లో ప్రదర్శనలు నిర్వహించాలని కోరాయి. ఈమేరకు మంగళ వారం ఆయా సంఘాలు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. రైతులు, కార్మిక, వ్యవసాయ కార్మికులు, ఇతర శ్రామిక వర్గాల జీవనాధారంపై పాలకులు నిరంతరం దాడి చేస్తున్నారని విమర్శించాయి. ఈనేపథ్యంలో కార్మిక, కర్షకుల ఐక్యతాదినాన్ని జయప్రదం చేయాలని కోరాయి.