Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ ప్రకటన
- గుర్తింపు పత్రాన్ని సీఎం చేతులమీదుగా అందుకున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ(యూఎన్‌డబ్ల్యూటీఓ) తొలి సారి నిర్వహించిన పోటీల్లో ప్రపంచ ఉత్తమ పర్యాటక గ్రామంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్‌పోచం పల్లి ఎంపికైంది. మంగళవారం ప్రగతి భవన్లో ప్రపంచ పర్యాటక సంస్థ జారీచేసిన గుర్తింపు పత్రాన్ని ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేతులమీదుగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్, ఆ శాఖ ఎమ్డీ బి.మనోహర్‌రావు అందుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను శాలువాతో సీఎం సత్కరించారు. పర్యాటక శాఖ అధికారులను అభినందించారు. ఈ పోటీలో ప్రపంచవ్యాప్తంగా 75 దేశాల నుంచి 170 ప్రతిపాదనలు(మన దేశం నుంచి మూడు) వెళ్లగా అందులో భూదాన్‌పోచంపల్లి ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికై అరుదైన ఘనత సాధించింది.