Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్య సేవల్లో మూడో స్థానంలో రాష్ట్రం
- 'మన ఊరు-మన బడి'తో అందరికీ ఆంగ్ల విద్య : ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
- బాలానగర్‌లో 30 పడకల ఆస్పత్రి ప్రారంభం
నవతెలంగాణ - బాలానగర్ / మహబూబ్‌నగర్
కరోనా, ఒమిక్రాన్ కొత్త వేరియంట్ నేపథ్యంలో రానున్న మూడు వారాలు అత్యంత కీలకమని, ఆ రోజుల్లో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మహ బూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో నిర్మించిన 30 పడకల ఆస్పత్రిని ఆరోగ్య శాఖ మంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు డాక్టర్ లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర రెడ్డితో కలిసి మంగళవారం ప్రారంభించారు. అదేవిధంగా, జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశమందిరంలో ఆరోగ్యశాఖ పనితీరుపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా వైద్యసేవల సూచిలో కేరళ, తమిళనాడు తర్వాత తెలంగాణ రాష్ట్రంఉందన్నారు. ఒమిక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో 2కోట్ల పరీక్షలకిట్లు, కోటి హోం ఐసోలేషన్ కిట్లు అందుబాటులో ఉంచామన్నారు. కరోనా పాజిటివ్ రాగానే భయపడి ప్రయివేట్ ఆస్ప త్రులనుఆశ్రయించి డబ్బులువృథా చేసుకోవద్దన్నారు. ప్రతి రోజూ ఆశాలు, ఆరోగ్య సిబ్బంది పరీక్షలు చేస్తా రని, వ్యాధి లక్షణాలుంటే ఆస్పత్రికి తరలిస్తారని చెప్పారు. ఆక్సిజన్ సౌకర్యం అందుబాటులో ఉంద న్నారు. ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలు పాటించా లని సూచించారు. ప్రజలను వచ్చే మూడు వారాలు కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఇప్పటికే మొదటి డోస్ వ్యాక్సిన్ వంద శాతం పూర్తి చేశామని, రెండో డోసు పూర్తి చేయాల్సి ఉందన్నారు. 60 ఏండ్ల పైబడిన వారందరికి బూస్టర్ డోస్ వేస్తున్నామన్నారు. 15 నుంచి 18 ఏండ్లు పైబడిన వారందరూ వ్యాక్సిన్ వేయించుకునేలా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. అందరికీ ఆంగ్ల విద్య అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 'మన ఊరు-మన బడి' కార్యక్రమం ద్వారా రూ.7,289 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించిందన్నారు. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ విద్యాసంస్థలను నెల కొల్పనున్నట్టు తెలిపారు. సమీక్షలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. జిల్లాలో ప్రయివేట్ ఆస్పత్రుల ఫీజుల దోపిడీని అరికట్టాలంటే వైద్యులు తమ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాలని ఆరోగ్య సిబ్బందికి సూచిం చారు. ప్రయివేట్ ఆస్పత్రులు ప్రసూతి పేరుతో ఆప రేషన్ చేస్తూ కోట్లు దోపిడీ చేస్తుంటే ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జిల్లా ఆస్పత్రుల్లో ప్రసూతి కేసుల సంఖ్యను పెంచాలన్నారు. జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ కార్యాలయంలో రూ.300 కోట్లతో 900 పడకల ఆస్పత్రిని నిర్మిస్తామని, వచ్చే నెలలో ఆ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారని ప్రకటించారు. అనంతరం ఆస్పత్రి నమూనా పోస్టర్‌ను ఆవిష్కరిం చారు. ఈ కార్యక్రమాల్లో హెల్త్ డైరెక్టర్ రమేష్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ తేజాస్ నందలాల్ పవర్, జెడ్పీటీసీ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.