Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు దాని ప్రాధాన్యత పెరిగింది
- ఆదివాసీ సాంప్రదాయక వైద్యరీతులపై ఆన్లైన్ జాతీయ వర్క్ షాప్‌లో మంత్రి సత్యవతి రాథోడ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
శాస్త్ర, సాంకేతిక రంగాలు ఎంతో వృద్ధిచెందినా అడవుల్లో ఆదివాసీ, గిరిజన బిడ్డలు చేసే ప్రకృతి వైద్యానికి ఉన్న ప్రాధాన్యత, ప్రత్యేకత రోజురోజుకీ పెరిగిపోతు న్నదనీ, ఈ నేపథ్యంలో దాన్ని పరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కరోనా సమ యంలో ఈ ప్రకృతి వైద్యం ప్రాశస్త్యం మరింత పెరిగిందని చెప్పారు. భవిష్యత్ తరాల కోసం ఈ వైద్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఆదివాసీ సాంప్రదా యక వైద్యరీతులపై ఆన్ లైన్ కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం జరిగిన జాతీయ వర్క్‌షాప్‌లో మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొని ప్రసంగించారు. ప్రకృతిలో దొరికే మూలికల ద్వారా జరిగే వైద్యం ద్వారా సైడ్ ఎఫెక్ట్లు కూడా ఉండవన్నారు. అందుకే దీనికి ఇప్పుడు ఆదరణ బాగా పెరుగుతున్నదని చెప్పారు. అడవుల్లో దొరికే అటవీ ఉత్పత్తుల మీద ఆధారపడి, ప్రమాదం వచ్చినప్పుడు ప్రకృతి వైద్యం పొందడం వల్ల వందేండ్లకు పైగా జీవించిన విషయాన్ని గుర్తుచేశారు. గిరిజనుల ఆహార విధానాన్ని, వైద్యాన్ని ముందుకు తీసుకెళ్లాలన్ని అవసరముందని నొక్కిచెప్పారు. ప్రకృతివైద్యం పరిశోధనలు మరింత పెరగాలని ఆకాంక్షించారు.