Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక రోజు సమ్మె జయప్రదం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశవ్యాప్తంగా మెడికల్, సేల్స్ రిప్రంజెంటీవ్స్ చేసిన ఒక రోజు సమ్మె విజయవంతమైంది. అఖిల భారత పిలుపులో భాగంగా రాష్ట్రంలో తెలంగాణ మెడికల్, సేల్స్ రిప్రజెంటీటివ్స్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం ఆయా జిల్లాల్లో ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. యూనియన్కున్న 15 శాఖల పరిధిలో జిల్లాల్లో కోవిడ్-19 నిబంధనలను అనుసరించి స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు నిర్వహించారు. నల్లగొండ, మహబూబ్ నగర్, సిద్ధిపేట తదితర జిల్లాల్లో సీఐటీయూ నాయకులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా 15 శాఖల నుంచి కనీస వేతనాన్ని నిర్ణయించాలని తదితర డిమాండ్లతో ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖను రాసి ఈమెయిల్ చేశారు. హైదరాబాద్లోని పాతనగరంలో జరిగిన సమావేశంలో ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ.రాజుభట్ పాల్గొన్నారు.