Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 22న ములుగు జిల్లా బంద్‌కు పిలుపు
- జేఎండబ్య్లూపీ డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేశ్ పేరుతో లేఖ
నవతెలంగాణ-వెంకటాపురం
ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్ బూటకమేనని జేఎండబ్య్లూపీ(జయశంకర్, ములుగు, వరంగల్, పెద్దపల్లి) డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేశ్ పేరుతో బుధవారం ఒక లేఖ విడుదలయ్యింది. ఈ లేఖలో పలు వివరాలు వెల్లడించారు. 10 మంది సభ్యులున్న సమయంలో చుట్టుముట్టిన గ్రేహౌండ్స్ బలగాలు ముగ్గురు విప్లవకారులను కాల్చి చంపారనీ, ఇది ముమ్మాటికీ బూటకపు ఎన్‌కౌంటరేనని పేర్కొన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఈ నెల 22న ములుగు జిల్లా బంద్‌కు పిలుపునిస్తున్నట్టు తెలిపారు. మావోయిస్టు రాష్ట్ర పార్టీ.. తెలంగాణ సరిహద్దుల్లో రాజకీయ నాయకులు, సర్పంచ్‌లు, కాంట్రాక్టర్లను చంపడానికి పెద్దఎత్తున గుమికూడారని పోలీసులు మాపై పాత కధనే చెబుతున్నారని ఆరోపించారు. 10మందితో కూడిన దళం వెంకటాపురం, వాజేడు మండలాల్లోని ప్రజల సమస్యలు తెలుసుకునేందకు వెళ్లిందన్నారు. ఈ క్రమంలో మావోయిస్టు దళాలను నిర్మూలించేందకు జంతువుల వేట పేరుతో ఇన్ఫార్మర్లను అడవుల్లోకి పంపి కచ్చితమైన సమాచారం తెలుసుకుని వారిని చుట్టుముట్టి ఏకపక్షంగా కాల్పులు జరిపారని ఆరోపించారు. నిజాలు వెలుగులోకి వస్తాయని మీడియాను సైతం ఆ ప్రాంతానికి వెళ్లనీయలేదని, వారికి సమాచారం ఇవ్వలేదని పేర్కొన్నారు. మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో వెంకటాపురం, వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత అలియాస్ మడకం సింగే, ఇల్లెందు నర్పంపేట దళ కమాండర్ కొమ్ముల నరేష్, కోవాసీ మూయాల్ అలియాస్ కైలాస్ మృతిచెందినట్టు తెలిపారు. ఎన్‌కౌంటర్‌కు నిరసనగా తలపెట్టిన బంద్‌ను ప్రజలు, వ్యాపారులు స్వచ్చందంగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.