Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా నేపథ్యంలో ప్రజలకు పోలీసు అధికారుల హామీ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి :
కరోనా థర్డ్‌వేవ్ విజృంభిస్తున్న తరుణంలో పోలీసు స్టేషన్ల వరకు వచ్చి బాధితులు వచ్చే అవసరం లేకుండా ఫోన్లో ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకునేలా పోలీసు అధికా రులు అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు ఏదైనా ఫిర్యాదు ఉంటే బాధి తులు సంబంధిత పోలీసు స్టేషన్‌కు ఫోన్ చేస్తే ఆ మేరకు ఫిర్యాదు నమోదు చేసుకొని దానికి సంబంధించిన రశీదును వారి ఇంటికి వచ్చి ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. కరోనా థర్డ్‌వేవ్ విజృంభిస్తూ పోలీసు స్టేషన్లకు కూడా తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న దశలో స్టేషన్‌కు వచ్చే బాధితులును కలవడానికి ఆస్కారం లేని పరిస్థితులు అధికారులకు ఏర్పడుతున్నాయి.