Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో గిరిజనులకు కేసీఆర్ చేస్తున్న అన్యాయాలపై పోరాడుతున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్ చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లోని హోటల్ రాడిషన్లో 'మిషన్-12' పేరుతో రాష్ట్రంలోని ఎస్టీ నియోజకవర్గాలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావ్, మాజీ ఎంపీలు రవీంద్ర నాయక్, రమేష్ రాథోడ్, చాడ సురేష్‌రెడ్డి, సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి, ప్రధానకార్యదర్శులు బంగారు శ్రుతి, ప్రేమేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి, ఎస్టీ మోర్చా అధ్యక్షుడు హుస్సేన్ నాయక్, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ..టీఆర్ఎస్ సర్కారు గిరిజనులకు తీవ్ర ద్రోహం చేసిందన్నారు.