Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇకపై క్షణం కూడా కరెంటు పోదు
- రాయదుర్గం జీఐ సబ్‌స్టేషన్ పనుల పరిశీనలనలో మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ విద్యుత్ వలయం ఏర్పాటు చేశామనీ, ఇకపై ఒక్క క్షణం కూడా కరెంటు కోతలు ఉండవని విద్యుత్‌శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి చెప్పారు. బుధవారంనాడాయన టీఎస్ జెన్కో, ట్రాన్స్‌కో సీఎమ్‌డీ దేవులపల్లి ప్రభాకరరావు, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎమ్‌డీ జీ రఘుమారెడ్డితో కలిసి రాయదుర్గం లోని 400 కేవీ గ్యాస్ ఇన్సూలేటెడ్ (జీఐ) సబ్‌స్టేషన్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సబ్‌స్టేషన్ దేశంలోనే మొదటి గ్యాస్ ఇన్సూలేటెడ్ సబ్‌స్టేషన్ అని చెప్పారు. హైదరాబాద్ నగరం అత్యంత వేగంగా అభివద్ధి చెందుతున్నదనీ, దానికి అనుగుణంగా నగరం నలువైపులా విద్యుత్ వ్యవస్థను అభివద్ధి చేస్తున్నామన్నారు. వచ్చే 30-40 ఏండ్ల అవసరాలను దష్టిలో ఉంచుకొని విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. రింగ్ రోడ్ చుట్టూ 400 కేవీ, 220 కేవీ, 133 కేవీ, 33 కేవీ సబ్స్టేషన్లను ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేశామన్నారు. దీనికోసం వంద ఎకరాల స్థలం అవసరం కాగా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కేవలం ఐదెకరాల్లోనే వీటన్నింటినీ నిర్మించినట్టు తెలిపారు. గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్‌కు మూడు కిలోమీటర్లు కేబుల్స్ అండర్ గ్రౌండ్ నుండి ఏర్పాటు చేశామనీ, దేశంలోనే మొదటిసారిగా మోనో పోల్స్ కూడా వాడినట్టు తెలిపారు. టీఎస్ ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో నిర్మాణ పనులు వేగంగా జరిగాయన్నారు.ఈ సబ్‌స్టేషన్‌తో నగరానికి మరో రెండువేల మెగావాట్ల విద్యుత్‌ను సరఫరా చేయోచ్చని వివరించారు. దీని నిర్మాణానికి రూ.1,400 కోట్లు వ్యయం చేశామనీ, త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ దీన్ని ప్రారంభిస్తారని తెలిపారు.