Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టు తీర్పు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మైనారిటీ, నాన్ మైనారిటీ మెడికల్, డెంటల్ కాలేజీల్లో ఆయా కోర్సుల ఫీజులు తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజ్ రెగ్యులేషన్ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) నిర్ణయించిన మేరకే ఉండాలని హైకోర్టు తీర్పునిచ్చింది. టీఏఎఫ్ ఆర్సీ సిపార్సులకు విరుద్ధంగా ప్రభుత్వం ఫీజుల్ని నిర్ణయిస్తూ 2017లో ఇచ్చిన జీవోలు 41, 43లను కొట్టేసింది. పాత జీవో 29 ప్రకారమే ఫీజులు వసూళ్లు చేయాలని స్పష్టం చేసింది. అంత కంటే ఎక్కువ ఫీజులు వసూలు చేసి ఉంటే వాటిని నెల రోజుల్లోగా విద్యార్థులకు తిరిగి చెల్లించాలని కాలేజీలను ఆదేశించింది. పీజీ చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం విషయంలో తాత్సారం చేయొద్దని సూచించింది. చదువు పూర్తికాగానే సర్టిఫికెట్లు ఇవ్వాలని కాలేజీలను ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్రశర్మ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ బుధవారం కీలక తీర్పు వెలువరించింది. టీఎఎఫ్ఆర్సీ సిఫార్సులకు వ్యతిరేకంగా ప్రభుత్వం జీవోలు 41, 43లను జారీ చేయడాన్ని తప్పుపడుతూ హెల్త్ కేర్ రీఫామ్స్ డాక్టర్స్ అసోసియేషన్, ఉస్మానియా జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్, ఇతరులు వేర్వేరుగా వేసిన పిల్స్‌లో ఈ తీర్పు చెప్పింది.
ఆ జీవోలు చెల్లవు....
మైనార్టీ, నాన్ మైనార్టీ మెడికల్, డెంటల్ కళాశాల్లో ఆయా కోర్సుల ఫీజుల్ని ఖరారు చేయాల్సింది ఫీజుల టీఏఎఫ్ఆర్సీ. ఆ సిఫార్సులకు వ్యతిరేకంగా ప్రభుత్వం తన పరిధిని దాటి 2016-2019 సంవత్సరాలకు పీజుల్ని పెంచుతూ జీవోలు 41, 43 విడుదల చేసిందంటూ కోర్టు తప్పుపట్టింది.. 2017 మే 9న జారీ చేసిన ఆ రెండు జీవోలు చెల్లవని స్పష్టం చేసింది. 2016-2019 కాలానికి టీఏఎఫ్ఆర్సీ చేసిన సిఫార్సుల మేరకు 2016 మే 2న జారీ చేసిన జీవో 29కు లోబడే ఫీజులు వసూళ్లు చేయాలని కాలేజీలను ఆదేశించింది. ఎక్కువగా ఫీజులు వసూలు చేసుంటే ఆ మొత్తాలను నెల రోజుల్లోగా విద్యార్థులకు చెల్లించాలంది. ప్రభుత్వ ఉత్తర్వులు సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులకు వ్యతిరేకంగా ఉన్నందునే రెండు జీవోలను కొట్టేస్తున్నట్లు వెల్లడించింది. తెలంగాణ వచ్చాక 2015లో ఏర్పాటైన టీఏఎఫ్ఆర్సీ 2016-19 కాలానికి ఫీజుల నిర్ణయించాక పలు ప్రయివేటు మెడికల్ కాలేజీలు కోరాయని చెప్పి చీఫ్ సెక్రటరీ ఫీజుల్ని పెంచాలని ఎఫ్ఆర్సీకి లెటర్ రాస్తే ఫలితం లేకపోయిందనీ, దీంతో ఫీజుల్ని పెంచేస్తూ ప్రభుత్వమే నిబంధనలకు వ్యతిరేకంగా 2017 మే 9న జీవోలు 41, 43 ఇచ్చిందని, ఇవి చెల్లవని తీర్పునిచ్చింది.
స్వాతంత్య్ర సమరయోధులకు 300 గజాల స్థలం ఇవ్వాల్సిందే...
దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన సమరయోధులకు జీవో 185 నిబంధనల ప్రకారం 300 గజాల జాగా ఇవ్వాల్సిందేని రాష్ట్రానికి హైకోర్టు ఆదేశిం చింది. ఒక సమరయోధురాలి భార్యకు 80 గజాల స్థలం ఇచ్చామని చేతులు దులుకుంటే సరిపోదని నొక్కి చెప్పింది. ఆరు సంవత్స రాలుగా ఆమె జీవో 185 ప్రకారం 300 గజాల స్థలం ఇవ్వాలనే డిమాండ్‌పై కార్యాల యాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితిని కల్పించ డంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 185 జీవో ప్రకారం 300 గజాల స్థలం ఇవ్వాలని కోరు తూ వరంగల్‌కు చెందిన స్వాతంత్య్ర సమర యోధులు దివంగత బైరోజు లక్ష్మయ్య భార్య బి.చుల్కమ్మ అర్జీ మేరకు అక్కడి అధికారులు 80 గజాలే ఇచ్చారు. మరో తొమ్మిది మందికి 300 గజాలు చొప్పున ఇచ్చారు. దీనిపై చుల్కమ్మ హైకోర్టును ఆశ్రయిస్తే సింగిల్ జడ్జి వద్ద కేసు విచారణలో ఉండగా ఆఫీసర్ల హామీ మేరకు కేసును వెనక్కి తీసుకున్నారు. అయితే ఆ హామీని అమలు చేయకపోవడంతో మళ్లీ రిట్ వేస్తే సింగిల్ జడ్జి కొట్టేశారు. దీంతో సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ ఆమె అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి డివిజన్ బెంచ్ బుధవారం విచారించింది.