Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆహారపు అలవాట్లపై విద్వేషపూరిత మాటలు దారుణం
- బలహీన వర్గాలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి : కేవీపీఎస్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
''పంది మాంసం తింటే పంది ఆలోచనలు వస్తాయి.. మేక మాంసం తింటే మేక ఆలోచనలు, కోడి మాంసం తింటే కోడిలాగా పెంటకుప్పల్లో ఏరుక తింటారు..'' అంటూ మెజార్టీ ప్రజల మనోభావాలు దెబ్బతినేలా ఉన్మాద పూరిత వ్యాఖ్యలు చేసిన చినజీయర్ స్వామిని తక్షణమే అరెస్టు చేసి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టు కింద కేసు నమోదు చేయాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్ )రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జాన్‌వెస్లీ, టి స్కైలాబ్ బాబు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సమాజంలో తిండి తినే స్వేచ్ఛ కూడా లేదా? అని ప్రశ్నించారు. చినజీయర్ స్వామికి ప్రజస్వామ్యం, రాజ్యాంగం పట్ల ఏమాత్రం గౌరవం లేదని ఈ వ్యాఖ్యలను బట్టే అర్ధమవుతున్నదని విమర్శించారు. దేశంలో మెజార్టీ ప్రజలు మాంసాహారులేనన్నారు. మతోన్మాద భావాలతో నూటికి 90శాతం మందిని కించపర్చడం అన్యాయమని పేర్కొన్నారు. దళితులు, గిరిజనులు పంది మాంసం తింటారంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన చినజీయర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయలకతీతంగా ప్రతీ ఒక్కరూ ఖండించాలని కోరారు. ట్రస్ట్ ముసుగులో ఆస్తులు పోగు చేసుకుంటూ దేశంలో రాందేవ్ బాబాను మించిపోయడని విమర్శించారు. చినజీయర్‌స్వామి బలహీన వర్గాలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.