Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఇటీవల ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత, కూచుకుల్ల దామోదర్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. శాసమండలిలో బుధవారం మండలి ప్రొటెం చైర్మెన్ జాఫ్రీ తన కార్యాలయంలో వారితో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వారికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వారికి మండలి రూల్స్బుక్స్, ఐడీకార్డు అందజేసి, శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, ఎంపీలు బీబీ పాటిల్, కేఆర్ సురేష్‌రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర చైర్మెన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, షకీల్ మహ్మద్, సంజరు కుమార్, పలువురు ఎమ్మెల్సీలు, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ నర్సింహాచార్యులు, నాయకులు శ్రీనివాసరెడ్డి, నారదాసు లక్ష్మణ్, బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు.