Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మహాత్మాగాంధీ క్యారికేచర్లు, కార్టూన్ల పోటీలో తెలంగాణ కార్టూనిస్ట్ జక్కుల వెంకటేష్ (జేవీ)కు మూడో స్థానం లభించింది. మధ్యప్రదేశ్‌కి చెందిన ఏక్తా పరిషత్ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో మొదటిసారి ఈ పోటీల్ని నిర్వహించింది. 54 దేశాలకు చెందిన 408 మంది కార్టూనిస్టులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. 1,012 క్యారికేచర్లు పోటీలో నిలిచాయి. బ్రెజిల్‌కి చెందిన అలీసన్ ఆర్టిజ్ గీసిన గాంధీ చిత్రానికి మొదటి బహుమతి లభించింది. ఇరాన్‌కి చెందిన అస్మిద్ సూఫీ క్యారికేచర్ రెండో స్థానంలో నిలిచింది. వెంకటేష్ గీసిన క్యారికేచర్కి తృతీయ బహుమతి లభించింది. వీ6, వెలుగు దినపత్రికలో పని చేస్తున్న జేవీ ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో ఎన్నో బహుమతులు అందుకున్నారు. తనకెంతో ఇష్టమైన గాంధీ చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చినందుకు ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు.