Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విరాసత్ పట్టా మార్పిడికి లంచం
- తహసీల్దార్ సొంత గ్రామంలో సొదాలు
నవతెలంగాణ - మరికల్
విరాసత్ పట్టా మార్పిడికి లంచం డిమాండ్ చేసి రూ.20వేలు తీసుకుంటుండగా తహసీల్దార్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో బుధవారం జరిగింది. ఏసీబీ డీఎస్పీ బి.శ్రీకృష్ణగౌడ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. చిన్న చింతకుంట మండలం లాల్కొట గ్రామానికి చెందిన రాసాల షైలమ్మ భర్త సతీష్ చనిపోయారు. సతీష్ పేరుపై ఉన్న 1.07 గుంటల భూమిని షైలమ్మకు విరాసత్ పట్టా మార్పిడి కొరకు 24.09.2021న ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకున్నారు. స్లాట్ బుక్ చేసుకొని తహసీల్దార్ దగ్గరకు వెళితే రూ.40 వేలు డిమాండ్ చేశారు. ఇవ్వలేనందున షైలమ్మను ఇప్పుడు, అప్పుడు అంటూ కార్యాలయం చుట్టూ తిప్పించుకున్నారు. చివరకు మధ్యవరి రుక్ముద్ధీన్ ద్వారా రూ.25 వేలు తహసీల్దార్‌కు ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. ఆ తర్వాత షైలమ్మ ఏసీబీ ఆశ్రయించింది. బుధవారం తహసీల్దార్ శ్రీధర్ రూ.20 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుబడ్డారు. తహసీల్దార్ సొంత గ్రామంలోనూ సోదాలు చేశారు. ఈ దాడుల్లో ఏసీబీ ఎస్ఐలు లింగ స్వామి, రామారావుతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.