Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్క్‌షాప్ ఉద్యోగులతో ఆర్టీసీ ఎమ్డీ సజ్జనార్
నవతెలంగాణ- హైదరాబాద్‌బ్యూరో
బస్సుల నిర్వహణలో ఖర్చును తగ్గిస్తూ, సంస్థకు ఆర్థిక చేయూతను ఇవ్వాలని టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ కోరారు. బుధవారంనాడాయన ఉప్పల్‌లోని ఆర్టీసీ జోనల్ వర్క్‌షాప్‌ను సందర్శించారు. అక్కడి ఇంజన్ సెక్షన్, యూనిట్స్, బాడీషాప్, స్టోర్స్, టైర్ రీట్రేడింగ్ షాప్, స్క్రాప్ యార్డ్‌లో కలియతిరిగారు. సిబ్బంది యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అక్కడి టెక్నికల్ నైపుణ్యాన్ని పెంచుకుంటూ, పనిలో నాణ్యతను పెంచాలని చెప్పారు. ఇటీవల ఈ వర్క్‌షాప్ నుంచి నేషనల్ కన్వెన్షన్ ఆన్ క్వాలిటీ కాన్సెప్ట్ (ఎన్సీక్యూసీ)లో పాల్గొని ఎక్స్‌లెన్స్ అవార్డు పొందిన టీం లీడర్లు డి రవీందర్, టి అన్వర్‌పాషా, ఆర్ హరికృష్ణ, కే కరుణాకర్‌రెడ్డిని ఎమ్డీ అభినందించారు. వర్క్‌షాప్‌లో మొక్కను నాటారు. కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పురుషోత్తం నాయక్, సీ వినోద్‌కుమార్, జోనల్ వర్క్‌షాప్ మేనేజర్ కవిత, కంట్రోలర్ ఆఫ్ స్టోర్స్ దేవదానం తదితరులు పాల్గొన్నారు.