Authorization
Tue April 08, 2025 07:32:30 pm
- మంత్రి జగదీశ్‌రెడ్డికి ట్రస్మా వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని పాఠశాలలను వెంటనే తెరవాలని ట్రస్మా డిమాండ్ చేసింది. ఈ మేరకు విద్యుత్ శాఖ మంత్రి జి జగదీశ్‌రెడ్డిని బుధవారం హైదరాబాద్‌లో ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు కందాల పాపిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎస్ఎన్ రెడ్డి కలిసి వినతిపత్రం సమర్పించారు. కరోనా పేరుతో పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తే వాటి ఉనికికే భంగం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధికి మూలమైన విద్యారంగం వెనుకబడిపోతుందని తెలిపారు. పాఠశాలలను వెంటనే తెరవాల్సిన అవసరముందని సూచించారు. అప్పుడే విద్యార్థుల భవిష్యత్తుకు మేలు కలుగుతుందని పేర్కొన్నారు. దీనికి స్పందించిన మంత్రి సానుకూలంగా స్పందించారు. కరోనా తీవ్రత తగ్గితే ఈనెల 31 నుంచి పాఠశాలలు తెరవబడతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా ఎగ్జిక్యూటివ్ జనరల్ సెక్రెటరీ ఆరుకాల రామచంద్రారెడ్డి, హైదరాబాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాణాల రాఘవ, నాయకులు చందన తదితరులు పాల్గొన్నారు.