Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్కేఎమ్ ఆధ్వర్యంలో 31న విద్రోహదినం
- ఫిబ్రవరి 23,24 సమ్మెను జయప్రదం చేయాలి
- ఉత్పత్తికి సంబంధం లేని పెట్టుబడి ఎంతొస్తే ఏం లాభం?: బి.వెంకట్
- రాజకీయ చైతన్యాన్నీ పెంచాలి : సారంపల్లి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ సర్కారు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మిక,కర్షక, వ్యవసాయకూలీల సంఘటిత పోరాటాలతోనే విజయం సాధ్యమవుతుం దని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ నొక్కి చెప్పారు. ఢిల్లీలో రైతాంగ పోరాటం విరమణ సమ యంలో ఇచ్చిన హామీలపై మోడీ సర్కారు స్పందించకపో వడాన్ని నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోరా(ఎస్కేమ్) ఆధ్వర్యంలో ఈనెల 31న విద్రోహ దినాన్ని నిర్వహి స్తున్నట్టు ప్రకటించారు. దేశవ్యాప్తంగా కార్మిక సంఘా లు ఫిబ్రవరి 23,24 తేదీల్లో తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెకు ఎస్కేఎమ్ మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కార్మిక-కర్షక ఐక్యత దినాన్ని సీఐటీయూ- తెలంగాణ రైతుసంఘం-వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భం గా వెంకట్ మాట్లాడుతూ.. ప్రపంచ కార్పొరేట్లను పెట్టుబడులు పెట్టేందుకు మోడీ ఆహ్వానించడం సిగ్గుచేటనీ, ఉత్పత్తిలో పాలుపంచుకోని ఆ పెట్టుబడి ఎందుకుని ప్రశ్నిం చారు. కరోనా సమయంలో ఎక్కువగా ఇబ్బంది పడింది కార్మికులు, వ్యవసాయ కార్మికులు, దినసరి కూలీలు, సామా న్యులేనన్నారు. వారిని కాపాడాల్సినబాధ్యతను మోడీసర్కారు విస్మరించిందనీ, కార్పొరేట్లకు పెద్దఎత్తున రాయితీలు ఇచ్చిందని విమర్శించారు. దేశంలోని కార్పొరేట్ల మీద ఒకశాతం పన్ను పెంచితే దేశ ప్రజలందరికీ ఆయుష్మాన్ భారత్ కింద వైద్య సేవలందించవచ్చని తెలిపారు. అదే నాలుగుశాతం పన్నుపెంచితే దేశంలోని సంక్షేమ పథకాల న్నింటినీ అమలు చేయొచ్చని వివరించారు. బీజేపీ ఓవైపు సరళీకరణ పేరుతో కార్పొరేట్లకు లబ్ది చేకూరుస్తూ, మరోవైపు మతోన్మాదాన్ని ప్రయోగించి రాజకీయంగా ప్రయోజనం పొందుతున్న తీరును విడమర్చి చెప్పారు. ఈ తరుణంలో కార్మికులు, కర్షకులు ఐక్యంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. అఖిల భారత కిసాన్‌సభ(ఏఐకేఎస్) ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ మాట్లాడుతూ..కార్మిక, రైతు సంఘాలు ఆర్థిక పోరాటాలకే పరిమితం కాకుండా కార్మికులు, కర్షకుల్లో రాజకీయ చైతన్యం పెంచాలని సూచిం చారు. వారు తమకు జరుగుతున్న అన్యాయాన్ని గ్రహించి పాలకులకు తమ ఓటు ద్వారా బుద్ధిచెప్పేలా చైతన్యం రగిలించాలని పిలుపునిచ్చా రు. కార్మిక-కర్షక మైత్రి దినోత్సవ ఆవశ్యకతను వివరించారు. బెంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ కార్మికులు, రైతులు కలిసి ఒకే సమయంలో పోరాటాలు చేస్తే ఎలాంటి సానుకూల ఫలితాలు వచ్చాయనే అంశాన్ని విడమర్చి చెప్పారు.
రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నంద్యాల నర్సింహారెడ్డి మాట్లాడుతూ..ఢిల్లీలో రైతాంగ పోరాటం ద్వారా మోడీ సర్కారు వ్యవసాయ నల్లచట్టాల నుంచి వెనక్కి తగ్గిందనీ, ఈ పోరాటంలో కార్మికుల సహాయం కూడా మరువలేనిదని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నదని విమర్శించారు. దోపిడీకి గురవుతున్న వారిని చైతన్యపర్చి తమ హక్కుల కోసం పోరాటా ల్లోకి తీసుకొచ్చేలా ఐక్య కార్యాచరణ ఉండాలని సూచించారు. కాంగ్రెస్ విధానాలే ప్రమాదకర మంటే.. బీజేపీవి అంతకు మించి ఉన్నాయనీ, ఇది దేశానికి మరింత ప్రమాదకరమని హెచ్చరించారు.
సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ...గ్రామీణ ప్రాంత శ్రామికులు, పారిశ్రా మిక కార్మికులు సమైక్యంగా 40 ఏండ్ల కిందట ఆనాటి పాలకుల ప్రజావ్యతిరేక విధానాలను ప్రతి ఘటిస్తూ సాగించిన పోరాటంలో పాలకుల దాష్టీకా నికి గురై 10 మంది అమరత్వం పొందిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ అమరత్వం నుంచి రగిలిన జ్వాలనే జనవరి 19 కార్మిక, కర్షక మైత్రి అన్నారు. ఆస్ఫూర్తితో నేటి మోడీ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు, కర్షకులు కలిసి పోరాటాలు చేయాలని పిలుపు నిచ్చారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షు లు బి.పద్మ, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్వీ రమ, ఉపాధ్యక్షులు పి.జయలక్ష్మి, కోశాధికారి వంగూరు రాములు మాట్లాడారు. రైతు సంఘం సహాయ కార్యదర్శి ఎం.శోభన్, సీఐటీయూ రాష్ట్ర నాయకులు కె.రమేశ్, పి.సుధాకర్, పి.శ్రీకాంత్, సోమన్న తదితరులు పాల్గొన్నారు.