Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడ్డుకున్న మహిళలు
నవతెలంగాణ-మహబూబాబాద్
మహబూబాబాద్ జిల్లాలోని సుందరయ్య కాలనీలో పేద గిరిజనులు నిర్మించుకున్న ఇండ్లనుకూల్చివేయడానికి మున్సిపల్అధికారులు బుధవారం ప్రయత్నించారు. గిరిజనులు ప్రతిఘటించి జేసీబీపై రాళ్లదాడి చేశారు. దాంతో అధికారులు వెనుదిరిగి వెళ్లారు. వివరాళ్లోకెళ్తే.. సుందరయ్య కాలనీ లో భూక్య బుజ్జి అనే మహిళ తన కూతురు భూక్య యశోదకు పసుపు కుం కుమ కింద ఇచ్చిన చిన్న గుడిసెను తొలగించుకొని మూడు రూముల ఇంటి నిర్మాణం చేపడుతున్నారు. మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి, ఇన్చార్జి తరంగిణి ఆధ్వర్యంలో మున్సిపల్ జేసీబీతో సదరు నిర్మాణాన్ని కూల్చివేతకు యత్నించారు. ఆ ఇంటికి విద్యుత్ మీటర్, మున్సిపల్ పన్ను రసీదు ఉన్నప్ప టికీ అధికారులు ప్రభుత్వ భూమి అంటూ కూల్చివేతకు ప్రయత్నించారు. దాంతో కాలనీలోని గిరిజన మహిళలందరూ కూల్చివేతను అడ్డుకుని నిరసన వ్యక్తంచేసి ధర్నాచేశారు. అయినా అధికారులు కూల్చివేతకు ప్రయత్నించ డంతో జేసీబీపై రాళ్ల దాడిచేశారు. దాంతో జేసీబీ అద్దాలు పగిలిపోయాయి. విషయం తెలుసుకున్న సీఐ వెంకటరత్నం జోక్యం చేసుకొని ఆందోళనకారు లకు సర్ధిచెప్పడంతో అధికారులు వెనుదిరిగి వెళ్లిపోయారు.