Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొత్తం 10.01 శాతం చెల్లింపు
- తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, పింఛన్దారులకు పెండింగ్లో ఉన్న మూడు డీఏలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో 2020 జనవరికి సంబంధించిన డీఏ 3.64 శాతం, అదే ఏడాది జులై నాటి 2.73 శాతం, 2021 జనవరికి సంబంధించిన 3.64 శాతం డీఏ... మొత్తంగా 10.01 శాతాన్ని వేతనంతో కలిపి ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇదిగాక 2021 జులై నాటి డీఏ (2.73) శాతం పెండింగ్లో ఉంది. ఇప్పుడు కొత్తగా (2022 జనవరి నాటిది) మరో డీఏను విడుదల చేయాల్సి ఉంది.
వీటి కోసం త్వరలోనే మరో జీవోను జారీ చేయనున్నారు. కరోనా వల్ల గత రెండేండ్లుగా డీఏ చెల్లింపుల్లో జాప్యం చోటు చేసుకున్నది. ఈ క్రమంలో ఇటీవల నిర్వహించిన మంత్రివర్గ సమావేశం ఆదేశాల మేరకు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు మూడు డీఏలను ఒకేసారి మంజూరు చూస్తూ ఉత్తర్వులను విడుదల చేశారు.