Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
టీఎస్ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్‌భవన్‌లో 30 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయినట్టు తెలిసింది. దీనితో వీరంతా ప్రస్తుతం హౌం ఐసోలేషన్‌లో ఉన్నారు. కార్యాలయంలో వ్యాధి విస్తరణ వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పటికీ యాజమాన్యం తీసుకుంటున్న నియంత్రణ చర్యల పట్ల ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు.
కేసులు పెరుగుతున్నా వందశాతం సిబ్బంది విధులకు హాజరు కావాల్సిందేనని ఆయా విభాగాల పర్యవేక్షక అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాప్తి నిరోధం జరిగే వరకు 50-50 రేషియోలో ఉద్యోగుల సేవల్ని వినియోగించుకోవాలని కోరుతున్నారు. అందుకు భిన్నంగా ఐదు రోజులు హౌం ఐసోలేషన్‌లో ఉండి విధులకు హాజరవ్వాలని చెప్పడం ఆందోళన కలిగిస్తున్నట్టు ఉద్యోగులు వాపోతున్నారు.