Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నూతన పద్ధతిని కనుగొన్న ఓయూ ప్రొఫెసర్ మురళీధర్‌రెడ్డి
- పేటెంట్ కోసం ప్రయత్నాలు
నవతెలంగాణ-ఓయూ
'డి' విటమిన్ టెస్టు రిజల్ట్ కోసం ఎక్కువసేపు వేచియుండే పరిస్థితికి ఓయూ కెమిస్ట్రీ విభాగం ప్రొఫెసర్ పి.మురళీధర్‌రెడ్డి తన నూతన పరిశోధనతో చెక్ పెట్టేశారు. కేవలం 9 నిమిషాల్లో నిర్ధారణ పరీక్షా ఫలితం తెలిసేలా తైవాన్ దేశానికి చెందిన సుచీ మెడికల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆన్ రెన్ హు సహకారంతో కొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు.
డి విటమిన్ లోపంతో ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది చిన్నారుల్లో దొడ్డు కాళ్లు (రికేట్స్ ), పెద్ద వారిలో ఆస్టియోమాలసియా వ్యాధి (ఎముకలు పెలుసు బారడం)తోపాటు బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్న సంగతి తెలిసిందే. డి విటమిన్ మానవ శరీరానికి సూర్యరశ్మి ద్వారా, ఆహారం ద్వారా అందుతుంది. శారీరక మార్పులు, వయసు, జీవనశైలి, నివసించే ప్రాంతం తదితర అంశాలు డి విటమిన్ లోపాలపై ప్రభావం చూపుతాయి. అటువంటి లోపాన్ని అధిగమించడా నికి ఓయూ ప్రొఫెసర్లు నూతన పద్ధతని కనుగొ న్నారు. తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో విటమిన్-డి శాతాన్ని గుర్తించే సరికొత్త విధానాన్ని ఉస్మానియాయూనివర్సిటీ కెమిస్ట్రీ (రసాయనశాస్త్రం) డిపార్టుమెంట్ ప్రొఫెసర్ పి.మురళీధర్‌రెడ్డి కనుగొ న్నారు. ''ర్యాపిడ్ సెన్సిటివ్ అడ్వాన్స్డ్ మాస్ స్పెక్టో మెట్రి మెథడ్ ఫర్ ఎవాల్యుయేషన్'' పేరిట నూతన పద్ధతిని అభివృద్ధి చేశారు. ఆయన ఆధ్వర్యంలో రెండేండ్లు శ్రమించి ఈ పద్ధతిని రూపొందించారు. తైవాన్ దేశానికి చెందిన సుచీ మెడికల్ యూనివర్సిటీ ప్రొ.ఆన్ రెన్ హు ఇందుకు సహకారం అందించారు.
తక్కువ ఖర్చుతోనే త్వరలో రిజల్ట్
విటమిన్-డి స్థాయిని గుర్తించేందుకు ''కెమిల్యూ మ్నిసెంట్ ఇమ్యునో ఆస్సై'' టెస్టు ప్రస్తుతానికి అందు బాటులో ఉంది.
దీనికి ప్రయివేటు ల్యాబుల్లో అయితే రూ.500 నుంచి రూ.800 వరకు వసూలు చేస్తు న్నారు. టెస్టు తర్వాత ఫలితం వచ్చేందుకు 35 నిమి షాలకు పైగా సమయం పడుతుంది. ఓయూ ప్రొఫె సర్ మురళీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎల్సీ-ఎంఎస్, ఎల్సీ -ఎంఎస్/ఎంఎస్, జీసీ-ఎంఎస్, జీసీ-ఎంఎస్/ఎం ఎస్ విధానాల్లో ఈ పరీక్షను డెవలప్ చేశారు. వీటిల్లో జీసీ-ఎంఎస్/ఎంఎస్ విధానం ఉత్తమంగా పనిచేస్తు న్నట్టు ఆయన టీమ్ తేల్చింది.
కేవలం రూ.50 ఖర్చుతో 9నిమిషాల్లోనే టెస్టుకు సంబంధించిన రిజ ల్లు రాబట్టవొచ్చని తేల్చింది. కెమిల్యూమ్నిసెంట్ పరీ క్షకు రక్తనమూనా (శాంపిల్) 0.5 ఎం.ఎల్ అవసరం ఉండగా.. తాజా విధానంలో 0.2 ఎంఎల్ శాంపిల్ తీసుకుంటే సరిపోతుందని వీరి పరిశోధనలో రుజువు చేశారు.
రెండు రకాలు గుర్తించవచ్చు
విటమిన్ డి అనేది డి2 , డి3 రకాలుగా ఉంటుంది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న పరీక్షతో నేరుగా విటమిన్-డి స్థాయినే గుర్తించే వీలుంది. ఈకొత్త విధానంలో డి2, డి3 రకాలస్థాయిలు గుర్తించే అవకాశం ఉంది.
వీగన్స్‌లో అత్యంత తక్కువ
ప్రొఫెసర్ మురళీధర్‌రెడ్డి విటమిన్-డి లోపంపై లోతైన పరిశోధన, అధ్యయనం చేశారు. శాకాహారు లు, మాంసాహారులు చెరో 50 మంది, వీగన్స్ 25 మందిని ఎంపిక చేసి విటమిన్ డి స్థాయిలను లెక్కిం చారు. ఇందులో దాదాపు అందరిలోనూ విటమిన్ డి స్థాయి తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ఈ నూతన పరిశోధనా విధానానికి పేటెంట్ హక్కు పొందేందుకు ప్రొఫెసర్ మురళీధర్‌రెడ్డి కృషి చేస్తున్నారు. పలు బయోటెక్ కంపెనీలు కూడా వారితో ఎంఓయూ కోసం ప్రతిపాదనలు పంపుతున్నాయి.
కేటగిరీల వారీగా విటమిన్-డి లోపం ఇలా.. (శాతాల్లో)
విభాగం అత్యంత తక్కువ తక్కువ పర్వాలేదు సరిపడా ఉంది
మాంసాహారులు 17.02 53.19 25.53 4.26
శాకాహారులు 6.52 58.70 28.26 6.52
వీగన్స్ 58.33 25 4.17 12.50