Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికార పార్టీకి తొత్తులుగా అధికారులు : రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కె. భాస్కర్
- రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్లో 22 నుంచి 25 వరకు సీపీఐ(ఎం) రాష్ట్ర 3వ మహాసభలు
- విజయవంతం చేయాలని పిలుపు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
పెట్టుబడుదారులకు ఏజెంట్లుగా పాలకులు వ్యవహరిస్తున్నారని, అధికార పార్టీకి తొత్తులుగా అధికారులు మారారని సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కె. భాస్కర్ విమర్శించారు. రంగారెడ్డి జిల్లాలో ఈ నెల 22 నుంచి 25 వరకు జరగనున్న సీపీఐ(ఎం) రాష్ట్ర 3వ మహాసభల్లో భాగంగా బుధవారం దా సేంట్ హోటల్లో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీశ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి భాస్కర్ మాట్లాడుతూ.. జిల్లాలో మొదటిసారి జరుగుతున్న సీపీఐ(ఎం) రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మహాసభల సందర్భంగా ఈ నెల 22న నిర్వహించే ఆన్లైన్ బహిరంగ సభలో పెద్ద సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు, నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా సీపీఐ(ఎం) జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, పోలిట్బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్, బీవీ రాఘవులు హాజరవుతారని తెలిపారు. సభకు 640 మంది ప్రతినిధులు, 200 మంది అబ్జార్వర్లు, 200 మంది వాలంటీర్లు పాల్గొంటారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు ఏజెంట్లుగా పనిచేస్తున్నాయని, బీజేపీ ప్రభుత్వ సంస్థలను బడా వ్యాపారులకు, రాష్ట్రంలో టీఆర్ఎస్ పేదల భూములను లాక్కొని రియల్టర్లకు దారదత్తం చేస్తోందన్నారు. ముఖ్యంగా జిల్లాలో భూ సేకరణ పేరుతో ప్రజా ప్రతినిధులు పేదల భూములు లాక్కొంటున్నారని తెలిపారు. భూ నిర్వాసితులకు అందాల్సిన పరిహారం సకాలంలో అందక రైతులు నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా ఫార్మా కంపెనీ లను జిల్లాలో స్థాపించి ప్రజలను విషపుకోరల్లో ముంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందనివిమర్శించారు. చౌటుప్పల్ప్రాంతంలో ఫార్మాకంపెనీ వ్యర్థాలతో ప్రజలు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలి పారు. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లాలో వేలాది ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేస్తే ప్రజల పరిస్థితి ఏంటనీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గతంలో టాటా ఏరోస్పేస్ కంపెనీ కోసం చేసిన భూ సేకరణలో.. స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామని రైతులను మభ్యపెట్టారనీ, ఇప్పటికీ ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. రాంఖీ, హెచ్ఎమ్డీ జాయింట్ వెంచర్ పేరుతో తుక్కగూడలో పేద రైతుల నుంచి సుమారు 700ఎకరాల భూమిసేకరించి, వారికిఇవ్వాల్సిన పరిహారం ఇవ్వకుండా రాంఖీ వేలకోట్లకు భూములు విక్రయిస్తోందని తెలిపారు. ఇలాం టి ప్రజాసమస్యలపై రాష్ట్ర మహాసభలో చర్చించి భవిష్యత్ పోరాటాలకు ప్రణాళికలు చేయనున్నట్టు తెలిపారు. చనున్నట్టుతెలిపారు. ఈ సమావేశం లో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు రమ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి.యాదయ్య, మధూసుదన్రెడ్డి, చంద్రమోహన్, శోభన్ పాల్గొన్నారు.