Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌కు టీపీటీఎఫ్ లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో 317 జీవో బాధిత ఉపాధ్యాయుల అన్ని రకాల అప్పీళ్లనూ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని టీపీటీఎఫ్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు గురువారం టీపీటీఎఫ్ అధ్యక్షులు కె రమణ, ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాసులు లేఖ రాశారు. నిషేధం విధించిన 13 జిల్లాలకు స్పౌజ్ బదిలీలను అనుమతించాలని కోరారు. సబ్జెక్టు, క్యాడర్‌గా పరస్పర బదిలీలకు అంగీకరించాలని సూచించారు. సీనియార్టీ జాబితాలో నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని తెలిపారు. వేసవిలో పదోన్నతులు, సాధారణ బదిలీలకు అనుమతిస్తూ స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులకు మొత్తం సర్వీసు పాయింట్లకు అనుమతిస్తూ వారిని సొంత జిల్లాలకు వచ్చేలా చూడాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులకు స్పౌజ్ బదిలీలకు అనుమతినివ్వాలని కోరారు. ఒంటరి, వితంతు మహిళలకు జిల్లాల కేటాయింపులో ప్రాధాన్యతలేక నష్టపోయినందున వారికి న్యాయం చేయాలని సూచించారు.