Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న పలువురు ఐఏఎస్‌లకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్, రీసెర్స్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ జనరల్‌గా ఎ.వాణి ప్రసాద్‌ను ప్రభుత్వం నియమించింది. మాణిక్ రాజ్‌ను రెవెన్యూ శాఖ కార్యదర్శిగా, కె. నిర్మలను పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖ కార్యదర్శిగా, జీహెచ్ఎంసీ అడిషినల్ కమిషనర్లుగా పౌసుమి బసు, శృతి ఓజాలు నియమితులయ్యారు. విద్యాశాఖ ఉప కార్యదర్శిగా ఎం.హరిత, ఎంసీఆర్హెచ్ఆర్డీ డైరెక్టర్ జనరల్‌గా అనిత రాజేంద్ర, పశు సంవర్దక శాఖ స్పెషల్ సీిఎస్‌గా అధర్ సిన్హలను ప్రభుత్వం బదిలీ చేసింది.
దీర్ఘకాలిక భూ సమస్యలపై నివేదికలివ్వండి: కలెక్టర్లకు రాష్ట్ర సర్కార్ ఆదేశాలు
రాష్ట్రంలో ఏండ్ల తరబడి పరిష్కారం కాకుండా ఉన్న భూసమస్యలపై నివేదికలు ఇవ్వాలని అన్ని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఆదేశించింది. ఎక్కువ మంది రైతులతో ముడిపడి ఉన్న భూమికి సంబంధించిన సమస్యను ప్రత్యేక ఫార్మాట్ లో పంపాలని పేర్కొంది. ఆయా గ్రామాల్లోని సర్వే నెంబర్, అందులో వివాదంలో ఉన్న భూమి, ఆ భూమి సమస్యతో ఇబ్బంది పడుతున్న రైతుల వివరాలు పొందుపర్చాలని సూచించింది. అదే సమయంలో ఆ భూ సమస్య గురించి బ్రీఫ్ నోట్ తయారు చేసి ఇవ్వాలని కోరింది. రెవెన్యూ అధికారులతో క్షేత్రస్థాయి అధ్యయనం చేయించి ఆ సమస్య పరిష్కారానికి ఉన్న మార్గాలేమిటి? మీరు చూపించే ప్రతిపాదనలేంటి? అనే అంశాలను నివేదికల్లో పొందుపర్చాలని పేర్కొంది.