Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ వాణిదేవి
హైదరాబాద్: ప్రముఖ ఉపాధ్యాయులు ఠాగూర్ బ్రహ్మానందు సింగ్ సేవలు చిరస్మణీయమని, భావితరాలకు ఆదర్శమని ఎమ్మెల్సీ వాణి దేవి అన్నారు. ఇటీవల మరణించిన సింగ్ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. ఎమ్మెల్సీ వాణి దేవి భర్తకు రతన్ సింగ్ ఠాగూర్ కుటుంబంతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేశారు. అనంతరం మాజీ ప్రధాని పీవీ నరసింహారావుపై రాసిన జీవిత చరిత్ర పుస్తకాన్ని వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ జడ్పీ వైస్ చైర్మెన్ ఠాగూర్ బాలాజీ సింగ్, కౌన్సిలర్ బాలు నాయక్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొనుగోటి రవీందర్ రావు. తదితర నాయకులు పాల్గొన్నారు.