Authorization
Tue April 08, 2025 07:37:10 am
హైదరాబాద్ : ప్రభుత్వ రంగంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు హైదరాబాద్ జోన్ ఫీల్డ్ జనరల్ మేనేజర్‌గా కెఎస్ఎన్వి సుబ్బారావు నియమితులయ్యారు. ఈ జోన్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లోని 322 శాఖలు ఉన్నాయి. దాదాపుగా ఏడాదికి రూ.31,550 కోట్ల వ్యాపారం జరుగుతుంది. సుబ్బారావు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి బికామ్ అడ్వాన్స్డ్ అకౌంటెన్సీలో అత్యున్నత స్థాయిలో ఉత్తీర్ణులయ్యారు. న్యాయ శాస్త్రంలోనూ డిగ్రీ, సీఏఐఐబీ విద్యా అర్హతలు కలిగి ఉన్నారు. సుబ్బారావు జోన్ ఫీల్డ్ జీఎంగా పదోన్నతి పొందకు ముందు చెన్నరు జోన్‌లోని పలు దక్షిణాది రాష్ట్రాల శాఖల పరిపాలన బాధ్యతలు చూశారు. వివిధ ప్రాంతాల్లో పలు హౌదాల్లో అత్యంత సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించిన అనుభవం తనకుందని ఆ బ్యాంక్ తెలిపింది.