Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతు సంఘం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మంత్రివర్గ ఉప సంఘం గుర్తించిన ధరణి లోపాలను సరిచేసి పాసు పుస్తకాలను వెంటనే ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసింది. నాలుగు నెల్లల్లో ఉపసంఘం మూడు దఫాలుగా సమావేశమై...20 సమస్యలు ఉన్నట్టు తెలిపిందని పేర్కొంది. ఈమేరకు గురువారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి జంగారెడ్డి, టి సాగర్ ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే మంత్రివర్గం ఉప సంఘం కొన్ని లోపాలను గుర్తించలేదని పేర్కొన్నారు. 'వాస్తవ లోపాలు, పొరపాట్లను గుర్తించిన కమిటీ ఆ లోపాలను సరిచేయడానికి దరఖాస్తు దారుని నుంచి ఫీజువసూలు చేయాలని నిర్ణయించింది. దరఖాస్తుదారుని బయోమెట్రిక్ తీసుకోవాలని కోరింది. ప్రభుత్వ ఉద్యోగులు చేసిన పొరపాట్ల వల్ల ఈ లోపాలు జరిగినప్పుడు రైతుల నుంచి ఎలాంటి ఫీజు వసూలు చేయకుండా, బయోమెట్రిక్ తీసుకోకుండా నిర్దిష్టకాలంలో పొరపాట్లను సరిచేసి వాస్తవ హక్కుదారులకు పాసుపుస్తకాలలో నమోదుచేసి ఇవ్వాలి. ఆఫీసుల చుట్టూ రైతులు తిరగకుండా దరఖాస్తు చేసుకున్నవారందరికీ రికార్డులు సరి చేసి గ్రామ రెవెన్యూ అధికారుల ద్వారా సరిచేసిన పాసుపుస్తకాలు పంపిణి చేయాలి' వారు అని కోరారు.