Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనుమానాస్పదంగా కుటుంబం ఆత్మహత్య
- రెండ్రోజుల తర్వాత వెలుగులోకి..
- విషం తాగారా..? ఎవరైనా తాగించారా..?
నవతెలంగాణ-అమీన్పూర్
అమ్మనాన్న.. ఓ కూతురు.. ముచ్చటైన కుటుంబం. సజావుగా సాగిపోతున్న ఆ కుటుంబంలో ఏం జరిగిందో తెలియదు కానీ.. ఒక్కసారిగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారు నిజంగానే విషం తాగారా..? లేక మరేవరైనా విషం తాగించి చంపేశారా..? అన్నది తెలియదు. కానీ అనుమానాస్పదంగా తమ ఇంట్లో విషం తాగి బెడ్‌పై పడి ఉన్నారు. రెండ్రోజుల తర్వాత ఈ విషయం వెలుగులోకి రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ హృదయవిదారక ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీసుస్టేషన్ పరిధిలోని వందనపురి కాలనీకి చెందిన శ్రీకాంత్ గౌడ్(42), అనామిక(40) దంపతులకు తొమ్మిదేండ్ల కిందట పెండ్లి జరిగింది. వీరిది ప్రేమ వివాహం. వారి కూతురు శ్రీ స్నిగ్ధ(7). శ్రీకాంత్ గౌడ్ టీసీఎస్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అనమిక ఓ ప్రయివేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. అయితే అనామిక తల్లిదండ్రులు రెరడ్రోజులుగా ఆమెకు ఫోన్ చేస్తుంటే ఎలాంటి స్పందన రాలేదు. దాంతో అనుమానం వచ్చి అనామిక ఇంటికి వచ్చి చూడగా.. తలుపులు లోపలి నుంచి పెట్టి ఉండటంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అక్కడికి చేరుకొని తలుపులు తెరిచి చూడగా.. అనామిక, శ్రీ స్నిగ్ద.. విషం తాగి మంచంపైనే నిద్రావస్థలోనే మృతిచెందారు. పక్క గదిలో శ్రీకాంత్ గౌడ్(42) ఫ్యాన్‌కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. రెండు రోజుల కిందటే ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అనంతరం పోలీసులు, క్లూస్ టీమ్ మతదేహాలను పరిశీలించారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని సీఐ శ్రీనివాస్‌లు రెడ్డి తెలిపారు.