Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రానికి మంత్రి కేటీఆర్ లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు నిధులివ్వాలని ఆ శాఖ మంత్రి కేటీఆర్... కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆయన గురువారం లేఖ రాశారు. కూకట్పల్లి హౌజింగ్ బోర్డు నుంచి కోకాపేట మీదుగా నార్సింగ్ వరకూ నిర్మించతలపెట్టిన మాస్ ర్యాపిడ్ ట్రైన్ సిస్టమ్ (ఎమ్ఆర్టీఎస్), వరంగల్ మెట్రో నియో ప్రాజెక్టుకు నిధులివ్వాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. హైదరాబాద్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో నిర్మించబోతున్న మిస్సింగ్ లింక్ రోడ్ల కారిడార్లు, ప్యారడైజ్ నుంచి షామీర్పేట ఓఆర్ఆర్ కూడలి, కండ్లకోయ వరకూ ఆరు లైన్ల ఎలివేటెడ్ కారిడార్లకు నిధులివ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
నెలాఖరు వరకూ కోవిడ్ ఆంక్షలు
కోవిడ్ వ్యాప్తి, ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గతంలో విధించిన ఆంక్షలను ఈనెల 31 వరకూ పొడిగించింది. సాధారణ పరిపాలనాశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసిం ది. ప్రద ర్శనలు, సభలు, సమావేశాలు, రాజకీయ, మతపరమైన, సాంస్కృతిక కార్యక్రమాలపై ఇప్పటికే ఆంక్షలు విధించిన సంగతి విదితమే.