Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 20 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి : చాడ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, కనీస సౌకర్యాలు, డిజిటలైజేషన్ కోసం సీఎం కేసీఆర్ రూ.7,289 కోట్లు కేటాయించడాన్ని స్వాగతిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి తెలిపారు. నిర్దిష్ట సమయంలోగా వాటిని వెచ్చించి సర్కారీ పాఠశాలలను అభివృద్ధి చేయాలని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం మంచిదేనని వివరించారు. టీఆర్టీ ద్వారా అదనంగా 20 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతోపాటు నోటుపుస్తకాలు, స్టడీమెటీరియల్ అందజేయాలని సూచించారు. ఏపీ మాదిరిగా ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికీ ఏడాదికి రూ.15 వేల ప్రోత్సాహం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు.