Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సత్యవతి రాథోడ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఏడేండ్ల పాలనలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. దేశంలోని ఎస్సీ, ఎస్టీలకు ఏం ఒరగబెట్టిందో చెప్పాలని రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ ప్రశ్నించారు. తమ ప్రభుత్వం దళిత, గిరిజనులను విస్మరించిందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. గురువారం హైదరాబాద్లోని టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, బానోత్ హరిప్రియ, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డితో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. పోడు చట్టమనేది కేంద్రం పరిధిలో ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. ఈ విషయం తెలిసి కూడా బండి సంజరు రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడతామంటూ చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. అర్హులైన పోడు సాగుదార్ల నుంచి దరఖాస్తులను స్వీకరించామని తెలిపారు. త్వరలోనే వాటన్నింటినీ పరిష్కరించి, హక్కు పత్రాలను అందజేస్తామని చెప్పారు.