Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు (డీజీఈ)గా రాష్ట్ర సాంకేతిక విద్యాసంస్థ (సైట్) సంచాలకులు ఎ కృష్ణారావును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన గురువారం ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులుగా పనిచేసిన అలుగుబెల్లి సత్యనారాయణరెడ్డి (56) ఈనెల 13న గుండెపోటులో మరణించిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులుగా కృష్ణారావుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) సంచాలకులుగా ఎం సోమిరెడ్డికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఆయన టాస్ సంయుక్త సంచాలకులుగా పనిచేస్తున్నారు.