Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గమైన చర్యల వెనుక మోడీ, కేసీఆర్ ఉన్నారనీ, ఈ సమస్యలన్నీ పోవాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి ఆకాంక్షించారు. జీవో 126 ద్వారా ఉద్యోగాల భర్తీ, బదిలీలు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం జీవో 317ను తెచ్చి ఉద్యోగ, ఉపాధ్యాయులకు అన్యాయం చేస్తున్నదని విమర్శించారు. గురువారం గాంధీభవన్లో జనగాం జిల్లా అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరారు. వారికి రేవంత్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలనే లక్ష్యంతో ఇందిరాగాంధీ హయాంలో రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేశారు. బీజేపీ ఎంపీలనుకుంటే, ఈ జీవోను రద్దు చేయించే అవకాశం ఉందన్నారు. కానీ తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవోను రద్దు చేస్తామని రాజకీయ డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. కంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలను పరిష్కరించడం లేదని విమర్శించారు. ఒకరికొకరు రాజకీయ ప్రయోజనం కోసం కొనుగోలు సమస్యను పక్కదారి పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.