Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు ఆత్మహత్య
నవతెలంగాణ-నర్మెట్ట
అకాల వర్షాలతో పంటలు ధ్వంసమవడంతో మనోవేదనతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన జనగామ జిల్లా నర్మెట్ట మండలం సూర్యబండ తండా గ్రామపంచాయతీ పరిధిలోని అమర్సింగ్తండాలో గురువారం జరిగింది. ఏఎస్ఐ సదానందం తెలిపిన వివరాల ప్రకారం.. అమర్సింగ్తండాకు చెందిన తేజావత్ లచ్చిరాం(56) తనకున్న రెండెకరాల్లో పుచ్చ తోట వేశాడు. సుమారు రూ.70వేల వరకు పెట్టుబడి పెట్టాడు. పది రోజుల కిందట కురిసిన వర్షానికి పుచ్చతోట పూర్తిగా ధ్వంసమైంది. దాంతో మనోవేదనకు గురైన లచ్చిరాం.. ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు, తండావాసులు జనగామ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందాడు. భార్య సుగుణ ఫిర్యాదు మేరకు కేసుదర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్ఐ తెలిపారు.