Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రాల నెపంతో తండ్రి, ఇద్దరు కొడుకుల హత్య
నవతెలంగాణ - జగిత్యాల
మంత్రాల నెపంతో తండ్రి, ఇద్దరు కొడుకులను ప్రత్యర్థులు దారుణంగా హత్యచేశారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో గురువారం జరిగింది. జగిత్యాల జిల్లా వరుస హత్యలు, లైంగికదాడుల ఘటనలతో అట్టుడుకుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల పట్టణంలోని తారాకానగర్ కాలనీకి చెందిన తండ్రీ కొడుకులు జగన్నాథం నాగేశ్వర్రావు(55), రాంబాబు(30), రమేష్(23)పై ప్రత్యర్థులు కత్తులతో దాడి చేశారు. నాగేశ్వర్రావు, రాంబాబు అక్కడికక్కడే మృతిచెందారు. రమేష్‌ను ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి చనిపోయాడు. కుల సంఘం సమావేశం జరుగుతుండగా రెండు గ్రూపుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ ముగ్గురి హత్యలకు దారితీసినట్టు సమాచారం. ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ సింధుశర్మ పరిశీలించారు. ఆమె వెంట అడిషనల్ ఎస్పీ రూపేష్ కుమార్, డీఎస్పీ ప్రకాష్, సీఐ కృష్ణకుమార్ ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.