Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈపీటీఆర్ఐ క్యాలెండర్ ఆవిష్కరణలో మంత్రి అల్లోల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కాలుష్య రహిత పర్యావరణం, వాతావరణంలో మార్పులు- వ్యవసాయ రంగపై ప్రభావం, తదితర అంశాలపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవవసరం ఉందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్లో పర్యావరణ పరిరక్షణ శిక్షణ, పరిశోధనా సంస్థ(ఈపీటీఆర్ఐ)-2022 క్యాలెండర్ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..''గ్రీన్ ఇన్షియేటివ్స్'' అనే ఇతివృత్తంతో పాటు ప్రతి నెలా జరుపుకునే ముఖ్యమైన పర్యావరణ దినోత్సవాల ఆవశ్యకతను క్యాలెండర్లో పొందుపర్చటం బాగుందని ప్రశంసించారు. సమతుల్య వాతావరణ మార్పులు, సమతుల్యత కోసం కచ్చితమైన సమాచారమిచ్చేలా ఈపీటీఆర్ఐ పరిశోధనలు ఉండాలని సూచించారు. ఉష్ణోగ్రతలు పెంచే కార్బన్ డై ఆక్సైడ్, మిథేన్, నైట్రస్ ఆక్సైడ్ల విడుదలను నియంత్రించి భవిష్యత్ తరాలు సుఖంగా జీవించేలా ఆధ్యయనాలు జరగాల్సి ఉందన్నారు. విద్యుత్ ఆదా, వనరుల పరిరక్షణ ద్వారా సమకూరే ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్ అధర్ సిన్హా, ఎన్వీఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం.సునీలా, తదితరులు పాల్గొన్నారు.