Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్), ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) నోటిఫికేషన్లను వెంటనే ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. టెట్, టీఆర్టీ నోటిఫికేషన్ల కోసం రాష్ట్రంలో సుమారు ఐదు లక్షల మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నారని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 18 వేల ఉపాధ్యాయ పోస్టులు ఉన్నట్టా?లేనట్టా?అని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. టీఆర్టీ-2017 తరహాలో తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో ఉన్న ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.