Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎర్రోళ్ల శ్రీనివాస్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎనిమియా ముక్త భారత్ పథకం టెండర్లలో అక్రమాలు జరిగాయనీ, ఆ కుంభకోణంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు హస్తముందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీవీఎస్ ప్రభాకర్ చేసిన ఆరోపణలను తెలంగాణ రాష్ట్ర వైద్యమౌలిక సదుపాయాల సంస్థ చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఖండించారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ఆరోపణలు నిజమని నిరూపించాలనీ, లేదంటే తప్పు ఒప్పుకొని ముక్కు నేలకు రాయాలని సవాల్ విసిరారు.