Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అధర్ సిన్హా శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు ఆయన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మాసాబ్ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆధర్ సిన్హాను శాలువాతో మంత్రి సన్మానించారు. శుభాకాంక్షలు తెలిపారు. స్పెషల్ చీఫ్ సెక్రెటరీకి గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మెన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు.