Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసు...
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎమ్మార్ ప్రాపర్టీస్ స్కాంలో నిందితులుగా తమను చేర్చడాన్ని తప్పుపడుతూ స్టైలిష్ హౌమ్స్ రియల్ ఎస్టేట్స్ ప్రయివేట్ లిమిటెడ్ అధిపతి తుమ్మల రంగారావు వేసిన కేసులో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సీబీఐ నిందితులుగా పెట్టిన కేసులో అప్రూవర్‌గా మారారనీ, దానికి కింది కోర్టు అనుమతి ఇచ్చి సాక్షిగా పరిగణించిందని తెలిపారు. సీబీఐ కేసును ఆధారంగా చేసుకుని ఈడీ నమోదు చేసిన కేసులో తమను నిందితులుగా పరిగణించడాన్ని పిటిషనర్లు సవాల్ చేశారు. రిట్లను పరిశీలించిన న్యాయమూర్తి రాధారాణి విచారణను ఈనెల 25కు వాయిదా వేశారు. ఈడీ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు.