Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విషమ పరిస్థితిలో భార్య, మరో కుమారుడు
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్
కుటుంబంతో కలిసి బైక్పై చెర్వుగట్టుకు వెళ్లిన వారు.. తిరిగి ఇంటికెళ్తుండగా ఆగి ఉన్న డీసీఎంకు వెనక నుంచి ఢకొీట్టారు. ప్రమాదంలో తండ్రి, కుమారుడు అక్కడికక్కడే మృతిచెందారు. భార్య, మరో కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం గ్రామానికి చెందిన డాకోజు రామకృష్ణ, భార్య లక్ష్మీ, కుమారులు మణి చరణ్, ఈశ్వర్ సాయితో కలిసి బైకుపై చెర్వుగట్టుకు వెళ్లారు. సాయంత్రానికి తిరిగి ఇంటికి వస్తుండగా పంతంగి టోల్ ప్లాజా సమీపంలోని ఆరెగూడెం స్టేజి వద్ద ఆగి ఉన్న డీసీఎం ను వెనుక నుంచి బలంగా ఢ కొట్టారు. ఈ ప్రమాదంలో రామకృష్ణ(44), బైక్పై ముందు కూర్చున్న చిన్న కుమారుడు ఈశ్వర్ సాయి(9) అక్కడికక్కడే మరణించారు. లక్ష్మీ, పెద్ద కుమారుడు మణిచరణ్ తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాలను చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తీసుకెళ్లారు. మృతుడు లక్కారం రోడ్డుపైనే హెయిర్ సెలూన్ షాప్ నడిపేవాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబం మొత్తం ప్రమాదానికి గురవడం, తండ్రీకొడుకు చనిపోవడంతో బంధువులు, గ్రామస్తులు చౌటుప్పల్ ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రి ఆవరణలో రోదనలు మిన్నంటాయి.