Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీడబ్ల్యూజేఎఫ్ మీడియా డైరీని ఆవిష్కరించిన
- ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్)మీడియా డైరీ-2022ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. గురువారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య, ఉపాధ్యక్షులు పి. ఆనందం, వై. ప్రభాకర్, పి.రాంచందర్, కార్యదర్శులు ఎర్రం నర్సింగరావు, ఎస్కె.సలీమ, కోశాధికారి ఆర్.వెంకటేశ్వర్లు సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈసందర్భంగా ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు జర్నలిస్టులు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్సీ కవిత దృష్టికి తీసుకెళ్లారు. ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలనీ, హెల్త్‌కార్డులు అన్ని ఆస్పత్రుల్లో పనిచేసేలా చర్యలు తీసుకోవాలనీ, అన్నీ దిన, చిన్న, మధ్య తరహా పత్రికలు, మ్యాగజైన్లకు అక్రిడిటేషన్లు, ప్రకటనలు ఇచ్చేలా సహకరించాలని కోరారు. మహిళా జర్నలిస్టులకు పత్రికా సంస్థల్లో ప్రత్యేక సౌకర్యాలు కల్పించేలా చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్సీ కవిత ఫెడరేషన్ బృందంతో మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.