Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 1.80 కోట్ల విలువ గల 800 కిలోల గంజాయి స్వాధీనం : సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర
నవతెలంగాణ-మియాపూర్
అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 800 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈఘటనకు సంబంధించి సైబారాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాకు వివరాలు వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణాను శంషాబాద్, మియాపూర్ ఎస్ఓటీ పోలీసులకు.. గురువారం కొంతమంది వ్యక్తులు డీసీఎం ద్వారా అత్యధికంగా గంజాయిని తరలిస్తున్నట్టు పక్కా సమాచారం అందడంతో తనిఖీలు చేపట్టారు. నిందితులు ఒడిశా బార్డర్, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తుండగా శంషాబాద్, మియాపూర్ ఎస్ఓటీ పోలీసులు దాడులు చేసి ఔటర్ రింగ్‌రోడ్డులో వాహనాన్ని పట్టుకొని నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి 800 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముఠా సభ్యుల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన ఆరుగురిని అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని తెలిపారు. వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామన్నారు. గంజాయి విలువ సుమారు రూ. 1.80కోట్లు ఉంటుందని అంచనా వేశారు. వీరి నుంచి మొబైల్ ఫోన్లు, వాహనాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. కొద్ది నెలలుగా గంజాయి అక్రమ రవాణా పై తెలంగాణ పోలీస్, సైబరాబాద్ పోలీసులు అత్యంత వేగమైన దర్యాప్తు చేస్తూ నిందితులను అరెస్టు చేస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో మాదాపూర్ డీసీపీ శిల్ప వలి, మియాపూర్ ఏసీపీ కృష్ణ ప్రసాద్, మియాపూర్ ఇన్స్పెక్టర్ తిరుపతిరావు, ఎస్ఐలు వెంకటరెడ్డి, ఎస్ఓటీ శంషాబాద్ పోలీసులు తదితరులు ఈ ఆపరేషన్‌లో చక్కటి ప్రతిభ కనబరిచిన వారిని సీపీ అభినందించారు.