Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ఇండియాలో అతిపెద్ద సీపాస్ ప్రొవైడర్ 'తన్లా' సంస్థ మూడవ త్రైమాసికానికి 62 శాతంతో 2,610 మిలియన్ల లాభాలను ఆర్జించింది. మొత్తం ఆదాయం 8,849 మిలియన్లకు పెరిగింది. ఈ మేరకు తన్లా సంస్థ త్రైమాసిక ఆదాయ, వ్యయ ఫలితాలను ప్రకటించింది. షేర్ల ఆదాయం 70 శాతానికి పెరిగింది. ఈ ఏడాదిలో మొదటి తొమ్మిది నెలల ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటే సంస్థ మొత్తం ఆదాయం 23,529 మిలియన్లకు చేరింది. ఇదే కాలానికి పన్ను చెల్లింపుల అనంతరం లాభాలు 57 శాతం పెరిగి, 3,987 మిలియన్లగా నమోదైంది. ఈ సందర్భంగా తన్లా ప్లాట్ఫామ్స్ లిమిటెడ్ వ్యవస్థాపక చైర్మెన్ అండ్ సీఈఓ ఉదరురెడ్డి మాట్లాడుతూ గడచిన 22 త్రైమాసికాల్లో సంస్థ ఆదాయం గణనీయంగా పెరుగుతున్నదనీ, భవిష్యత్లో దీన్ని కొనసాగిస్తామనీ చెప్పారు.